
నందమూరి బాలకృష్ణ నటించిన లయన్ సినిమా ఈ గురువారం విడుదలై భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బి,సి సెంటర్ లలో మంచి ఓపెనింగ్స్ సాధించింది. విమర్శకుల నుండి మంచి స్పందన రానప్పటికీ అన్ని ప్రాంతాల్లో కలెక్షన్ల రూపంలో మంచి మొతాన్ని సాధించింది. బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు బాలయ్య సంభాషణలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్.
తాజా సమాచారం ప్రకారం 154 నిమిషాల నిడివిగల చిత్రాన్ని 14 నిమిషాలు తగ్గించారు. ప్రస్తుతం ఈ చిత్ర నిడివి 140 నిమిషాలు. ప్రేక్షకుల స్పందన మేరకు అనవసరమైన సన్నివేశాలను తొలగించారు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రామారావు నిర్మాత. మణిశర్మ సంగీతదర్శకుడు.

