నారా బ్రాహ్మణి పై మనోజ్ ఆసక్తికరమైన కామెంట్స్ !

Published on Oct 24, 2018 1:55 pm IST

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే యంగ్ హీరో మంచు మనోజ్, తాజాగా ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. శ్రీకాకుళంలోని పది గ్రామాలను బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. అన్ని రకాలుగా ఆ గ్రామాలను అభివృద్ధి చెయ్యటానికి ఇప్పటికే పనులను కూడా మొదలు పెట్టారు.

కాగా మనోజ్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ… ‘శ్రీకాకుళం కోసం మీరు చేస్తుంది చూస్తుంటే నిజంగా స్ఫూర్తి కలిగిస్తోంది బ్రాహ్మిణి. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళల్లో మీరు ఒకరు. పది గ్రామాలను దత్తత తీసుకోవటం అనేది మీరు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. కష్టాల్లో ఉన్నవారిని మీరు ఆదుకున్నే విధానం చూస్తుంటే.. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. లయన్ కూతురు ఎప్పటికీ లయనెసే. జై బాలయ్య’ అంటూ మనోజ్ పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు నందమూరి అభిమానులనే కాకుండా.. నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పై స్పందించే మనోజ్ కూడా ఇటీవలే తానూ సేవా కార్యక్రమాల్లోకి దిగనున్నట్లు, అందుకోసమే తిరుపతిలో కొన్ని రోజులు ఉండబోతున్నట్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :