వరుణ్ తేజ్ ‘లోఫర్’ ఆడియో రిలీజ్ డేట్

loafer1
మొదటి రెండు సినిమాలైన ‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి రెండు సినిమాలను ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చేసిన వరుణ్ తేజ్ తన మూడవ సినిమా ‘లోఫర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ ని పక్కా మాస్ హీరోగా ప్రెజంట్ చేసాడు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ లో వరుణ్ తేజ్ మాస్ ప్రెజంటేషన్ కి మంచి మార్కులే పడ్డాయి. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

అందులో భాగంగానే డిసెంబర్ 18ని రిలీజ్ డేట్ కోసం లాక్ చేసినట్లు ఇదివరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఆడియోని డిసెంబర్ 7న రిలీజ్ చేయడానికి సిద్దమైంది. ఈ ఆడియో లాంచ్ కి లోఫర్ టీంతో పాటు మెగా ఫ్యామిలీకి సంబందించిన హీరోస్ కూడా హాజరవుతారని సమాచారం. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో పూరి మదర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ సినిమాలో రేవతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్ర పోషించాడు. వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించే ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానుంది. సి కళ్యాణ్ నిర్మాత.

Exit mobile version