లాక్ డౌన్ రివ్యూ: ఫోరెన్సిక్- మలయాళ ఫిల్మ్(నెట్ ఫ్లిక్స్)

నటీనటులు: టోవినో థామస్, మమతా మోహన్‌దాస్
దర్శకత్వం: అఖిల్ పాల్ & అనాస్ ఖాన్
నిర్మించినవారు: నావిస్ జేవియర్, సిజు మాథ్యూ
సంగీతం: జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం: అఖిల్ జార్జ్
ఎడిట్ చేసినవారు: షమీర్ ముహమ్మద్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు మలయాళ ఫిల్మ్ ఫోరెన్సిక్ ని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

కథాంశం ఏమిటీ?

సిటీలో పసిపిల్లల కిడ్నాప్స్ మరియు మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అంతు చిక్కని ఈ మర్డర్స్ వెనకున్న వారిని పట్టుకోవడానికి ఐ పి ఎస్ ఆఫీసర్ రితిక(మమతా మోహన్ దాస్) అధికారులు నియమిస్తారు. ఈ కేసులో రితికాకు సహకరించడానికి శామ్యూల్(టోవినో థామస్) మరియు …ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ శిఖ(రెబ మోనికా జాన్)ను అప్పాయింట్ చేయడం జరుగుతుంది. కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొలది రితికా టీం కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు తెలుసుకుంటారు. అసలు ఈ కిల్లర్ ఎవరు? ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? రితిక టీమ్ అతన్ని ఎలా పట్టుకుంది? అనేది మిగతా కథ…

ఏమి బాగుంది?

ఓ సీరియల్ మర్డర్స్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమింపబడిన ఐ పి ఎస్ అధికారిణి పాత్రలో మమతా మోహన్ దాస్ ఆకట్టుకుంది. మొదటిసారి ఈతరహా రోల్ చేసిన ఆమె నటన మెప్పిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో ఆమె నటన అద్భుతం అని చెప్పాలి. ఇక మరో కీలక రోల్ చేసిన టోవినో థామస్ మెప్పించారు.

సంజూ కురుప్, రేంజి పనికార్ సపోర్టింగ్స్ రోల్స్ లో మెప్పించారు. బీజీఎమ్ మరియు కెమెరా వర్క్ బాగున్నాయి. సస్పెన్స్ ఫ్యాక్టర్ మరియి ఇంటర్వెల్ బ్యాంగ్ పరవాలేదు.

ఏమి బాగోలేదు?
డెబ్యూ డైరెక్టర్స్ అయిన అఖిల్ పాల్ మరియు అనాస్ ఖాన్ ఒక కేసును ఛేదించడంలో ఫోరెన్సిక్ సైన్స్ ఎలా ఉపయోగపడుతుందనే దాన్ని థ్రిల్లింగ్ ఫాక్టర్స్ తో వివరించాలని ప్రయత్నించారు. ఐతే కథనంలో పట్టులేకపోవడం వలన ప్రేక్షకులు దాన్ని ఎంజాయ్ చేయలేకపోయారు. సస్పెస్స్ కోసం అనేక కొత్తపాత్రలు పరిచయం చేసి కన్ఫ్యుజ్ చేశారు. క్లైమాక్స్ సైతం ఊహకు అందేలా సాగింది.

చివరి మాటగా

ప్రధాన పాత్రల నటన మరియు ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలు, కొన్ని ఆసక్తికర మలుపులతో పర్వాలేదని అనిపించినప్పటికీ ఆకట్టుకొని కథనం, అంచనాలకు అందే క్లైమాక్స్ మూవీని దెబ్బ తీశాయి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓ సారి ఈ చిత్రం చూడవచ్చు.
Rating: 2.5

సంబంధిత సమాచారం :

More