లాక్ డౌన్ రివ్యూ : లాల్ బజార్-హిందీ సిరీస్(జీ5)

లాక్ డౌన్ రివ్యూ : లాల్ బజార్-హిందీ సిరీస్(జీ5)

Published on Jul 9, 2020 3:51 PM IST

నటీనటులు : అనిర్బన్ చక్రవర్తి, హృషితా భట్, దిబియేండు భట్టాచార్య, రోంజిని చక్రవర్తి, సుబ్రత్ దత్తా, విజయ్ సింగ్

దర్శకత్వం: సయంతన్ ఘోసల్

నిర్మాత : నిస్పాల్ సింగ్

ఛాయాగ్రహణం : రమ్య సాహా

ఎడిటింగ్ : గౌరబ్ దత్తా

లాక్ డౌన్ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ లాల్ బజార్ ని ఎంచుకోవడం జరిగింది. హీరో అజయ్ దేవ్ గణ్ నిర్మాతగా జీ5లో అందుబాటులోకి వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

కలకత్తాలోని రెడ్ లైట్ ఏరియా సెక్స్ రాకెట్ మరియు దందాలకు అడ్డాగా ఉంటుంది. అక్కడ జరిగే అక్రమాలకు అడ్డుకట్టవేసి సాధారణ పరిస్థితులు తేవాలని పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఐతే ఆ ఏరియాలోని ఓ సెక్స్ వర్కర్ హత్యకు గురవడంతో పరిస్థితులు తారుమారవుతాయి. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు? లాల్ బజార్ లో అసలు ఏమి జరుగుతుంది? నేరాల వెనుకున్న వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

ఈ సిరీస్ లో ప్రాధాన పాత్రల చేసిన హ్రిషిత భట్ మెప్పిస్తుంది. మరో ప్రధాన పాత్ర చేసిన కౌశిక్ సేన్ తన నటనతో సిరీస్ కి మంచి ఆకర్షణ చేకూర్చారు. రెడ్ లైట్ ఏరియా సెట్ అప్ మరియు పురాతన కోలకతా నగరాన్ని తెరపై ఆవిష్కరించి తీరు బాగుంది. క్రైమ్ సన్నివేశాలతో పాటు కొన్ని ఇన్వెస్టిగేటివ్ సీన్స్ బాగున్నాయి. డైలాగ్స్ మరియు బీజీఎమ్ మరో ప్రధాన ఆకర్షణ.

 

ఏమి బాగోలేదు?

దర్శకుడు ప్రధాన కథలోకి వెళ్ళడానికి రెండు ఎపిసోడ్స్ కి పైగా సాగదీశారు, దీనితో మొదటి ఎపిసోడ్స్ బోరింగ్ గా ఉన్నాయి. ఈ కథలో ఉన్న కాంప్లెక్సిటీ మరియు లేయర్స్ గందరగోళానికి గురిచేస్తాయి. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ కథకు కావలసిన ట్విస్ట్స్ లేకపోవడం వలన ప్రేక్షకుడికి ఎటువంటి ఉత్కంఠ కలగదు. ఇక ప్రధాన పాత్రలు చేసిన నటులను మినహాయిస్తే మిగతా నటుల పెరఫార్మెన్సు ఏమాత్రం ఆకట్టుకోదు. ఈ సిరీస్ లో గే ఎపిసోడ్ కూడా ఇబ్బంది కలిగిస్తుంది.

 

చివరిమాటగా

మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లాల్ బజార్ సిరీస్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎటువంటి మలుపు లేకుండా సాగే సిరీస్ ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపడంలో విఫలం చెందించి. ఐతే చివరి రెండు ఎపిసోడ్స్ కొంచెం ఉపశమనం కలిగించే అంశాలు.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు