లాక్ డౌన్ రివ్యూ : “లాక్డ్” – తెలుగు వెబ్ సిరీస్ “ఆహా” లో ప్రసారం

లాక్ డౌన్ రివ్యూ : “లాక్డ్” – తెలుగు వెబ్ సిరీస్ “ఆహా” లో ప్రసారం

Published on Sep 16, 2020 3:42 PM IST


నటీనటులు : సత్యదేవ్, సంయుక్త, శ్రీ లక్ష్మి, అబిరామ్ వర్మ, కేశవ్ దీపక్, బిందు చంద్రమౌలి, వాసు ఇంటూరి, జాన్ కొట్టోలి మరియు రిషికాంత్

దర్శకత్వం: ప్రదీప్ దేవా కుమార్

నిర్మాత(లు): రామ్ గణేషన్, కె.ఎస్. మధుబాల, షణ్ముగ రాజా

ఎడిటర్: జికె ప్రసన్న

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న వెబ్ సిరీస్ “లాక్డ్”. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

డాక్టర్ ఆనంద్(సత్యదేవ్) ఒక పేరు మోసిన న్యూరో సర్జన్. ఒక పక్క తన డాక్టర్ వృత్తికి చేస్తూనే మెడికల్ సైన్స్ లో అతను ఒక కొత్త రూట్ ను ఎంచుకొని అందులో ఒక కీలక రీసెర్చ్ చేస్తుంటాడు. అయితే అంతా బాగానే ఉంది అనుకుంటుండగా సడన్ గా ఒకరోజు ఇద్దరు మహిళలు అతని ఇంటి పై దాడి చేస్తారు. ఈ ఘటన అనంతరం అతని ఇంటికి అతని కొలీగ్ మిషబ్ మరియు ఒక పాలై కూడా ఆనంద్ ఇంటికి వస్తారు. అలా వచ్చిన తర్వాత పలు కీలక ఇన్సిడెంట్స్ తర్వాత ఆ డాక్టర్ ఆనంద్ కు సంబంధించి ఒక షాకింగ్ నిజం రివీల్ అవుతుంది. అతనికి సంబంధించిన ఆ నిజం ఏమిటి? ఈ సిరీస్ లో డాక్టర్ ఆనంద్ ఎందుకంత ఇంపార్టెంట్ అనేది అసలు.

ఏమి బాగుంది?

ఈ లాక్డ్ వెబ్ సిరీస్ చూసాక మొట్ట మొదటిసారిగా మెచ్చుకోవాల్సింది మాత్రం ఈ సిరీస్ దర్శకుడు ప్రదీప్ దేవా కోసమే అని చెప్పాలి. అతను ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన విధానం కానీ కాన్సెప్ట్ కానీ గ్రిప్పింగ్ నరేషన్ కానీ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇవన్నీ ఈ సిరీస్ ను చూసే వారికీ మరింత ఆసక్తిని కనబరుస్తాయి. అలాగే అతను ప్రెజెంట్ చేసిన అంశాలు కూడా మంచి ఇంప్రెసివ్ గా ఉంటాయి.

ఇక మెయిన్ లీడ్ సత్య దేవ్ విషయానికి వస్తే ఒక సరైన రోల్ వస్తే సత్య దేవ్ ఎలాంటి పెర్ఫామెన్స్ ను ఇవ్వగలడో అతని సినిమాలను అబ్సర్వ్ చేసే వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా ఈ సిరీస్ లో ఒక ఇంటెలిజెంట్ డాక్ లా అవుట్ స్టాండింగ్ అవుట్ ఫుట్ ను ఇచ్చాడు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ నటన కానీ సూపర్బ్ అనిపిస్తాయి. ఇక అలాగే సీనియర్ నటి లక్ష్మి చాలా కాలం తర్వాత ఈ సిరీస్ తో అందులోను మంచి రోల్ తో ఆకట్టుకున్నారు.

అలాగే ఇలాంటి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లను చూసే వారికి అంశాలు కాస్త రియలిస్టిక్ గా ఉండాలని కోరుకుంటారు. వారిని నిరాశ పరచకుండా మంచి నిర్మాణ విలువలు ఈ సిరీస్ లో కనిపిస్తాయి. పలు సర్జరీ సీన్లు కానీ కొన్ని ఇతర సీరియస్ స్టఫ్ ఉన్న సన్నివేశాలను కూడా బాగా చూపించారు. అలాగే కొన్ని లాజిక్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి, కెమెరా వర్క్ అద్భుతమైన విజువల్స్ ను అందిస్తాయి. అలాగే ఒక సిరీస్ ఎంతో కీలకమైన ఎండింగ్ ను కూడా బాగా ఇంప్రెసివ్ గా డిజైన్ చేసారు.

ఏమి బాలేదు?

ఈ సిరీస్ లో కొన్ని మైనర్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ సిరీస్ లో డాక్టర్ చేసే రీసెర్చ్ కు సంబంధించి మరింత డిటైలింగ్ ఉంటే బాగుండేది. అలాగే సత్యదేవ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. వీటికి తోడు ఈ సిరీస్ స్టార్టింగ్ లో కాస్త డల్ నరేషన్ తో పాటు స్క్రీన్ ప్లే అందరికీ మొదటి సారే అర్ధం కాకపోవచ్చు. ఈ అంశాల్లో ఇంకా కేర్ తీసుకొంటే బాగుండేది.

చివరి మాటగా –

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ఈ లాక్డ్ వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ జానర్ సినిమాలు కానీ సిరీస్ లను ఇష్టపడే వారికి కానీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కంటెంట్ కానీ గ్రిప్పింగ్ నరేషన్ కానీ సత్యదేవ్ పెర్ఫామెన్స్ లు కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టే ఉంటాయి. సిరీస్ స్టార్టింగ్ లో అక్కడక్కడా మిస్సైన కొన్ని డిటైల్స్ మరియు స్క్రీన్ ప్లే లను పక్కన పెడితే ఈ వెబ్ సిరీస్ ను తప్పకుండా చూడొచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు