లాక్ డౌన్ రివ్యూ: మాఫియా హిందీ వెబ్ సిరీస్(జీ5)

తారాగణం: ఇషా సాహా, అనిండితా బోస్, నమిత్ దాస్, రిధిమా ఘోష్

దర్శకత్వం: బిర్సా దాస్‌గుప్తా

ఎడిటింగ్: సుమిత్ చౌదరి

ప్రొడక్షన్ డిజైన్: రిద్దీ బసక్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు మాఫియా హిందీ సిరీస్ ని ఎంచుకోవడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

 

లవర్స్ అయిన తాన్యా(మధురిమ రాయ్)కునాల్(సయాన్ బెనర్జీ) ఓ బ్యాచ్ లర్ పార్టీ అరేంజ్ చేస్తారు. ఈ పార్టీ కోసం ఆరేళ్ళ క్రితం వారు కాలేజీ డేస్ తరువాత విడిపోయిన ప్రదేశాన్ని ఎంచుకుంటారు. పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ మధ్య కొన్ని భయానక సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎదో తెలియని ఒక శక్తి వారిని వెంటాడుతుంది. వారికి ఎదురవుతున్న ఆ దారుణ పరిణామాలకు కారణం ఎవరు? వారికి ఆ ప్రదేశంలో ఎందుకు అలా జరుగుతుంది? మరి ఆ ఫ్రెండ్స్ అక్కడి నుండి ఎలా తప్పించుకున్నారు? అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

నటనపరంగా నమిత్ దాస్ ఆకట్టుకున్నారు. ఇక సంధర్భోచితంగా వచ్చే ట్విస్ట్ అలరిస్తాయి. ఉన్నతనమైన నిర్మాణ విలువలు మంచి అనుభూతిని కలిగించాయి. సిరీస్ తెరకెక్కించిన పరిసరాలు ఆకట్టుకోగా, ప్రారంభం సిరీస్ పై ఆసక్తిరేపింది. పాత్రలలోని భిన్న షేడ్స్ రివీల్ చేసిన విధానం బాగుంది. ఇక బీజీఎమ్ సిరీస్ కి మంచి ఆకర్షణ జోడించింది. కథలోని అసలు ట్విస్ట్ క్లైమాక్స్ లో అలరిస్తుంది.

 

ఏమి బాగోలేదు?

 

కీలకమైన సపోర్టింగ్ పాత్రల కోసం నటనలో నైపుణ్యం ఉన్న నటులను తీసుకుంటే బాగుండేది. ఇక క్లిష్టమైన కథనంలో ఉన్న అనేక అంశాలను తెరపై చూపించడంలో స్పష్టత లోపించింది. దాని వలన సిరీస్ చాలా చోట్ల గందర గోళానికి గురైంది. ఇక ఈ కథకు స్కిన్ షో అవసరం లేకున్నా మోతాదుకు మించి చూపించారు.

 

చివరి మాటగా

ఆకట్టుకొనే కథ, అలరించే మలుపులతో మాఫియా మంచి ఆరంభం అందుకుంది. ఐతే కథలో క్లిష్టత మరియు నిడివి నిరాశ పరిచే అంశాలు. మొత్తంగా మాఫియా పై ఈ లాక్ డౌన్ లో ఓ లుక్ వేయవచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం :

More