లాక్ డౌన్ రివ్యూ: మస్తీస్ – తెలుగు వెబ్ సిరీస్(ఆహా)

లాక్ డౌన్ రివ్యూ: మస్తీస్ – తెలుగు వెబ్ సిరీస్(ఆహా)

Published on Jul 8, 2020 2:18 PM IST

నటీనటులు : నవదీప్ పల్లపోలు, హెబా పటేల్, బిందు మాధవి, చాందిని చౌదరి, అక్షర గౌడ, రాజా చెంబోలు

రచయిత : క్రిష్ జాగర్లమూడి

లాక్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు తెలుగు ఓ టి టి ప్లాట్ ఫార్మ్ ఆహాలో విడుదలైన వెబ్ సిరీస్ మస్తీస్ ని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

భార్య భర్తలు అయిన ప్రణవ్(నవదీప్) గౌరీ( బిందు మాధవి) మస్తీస్ అనే పోష్ రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు. ఆ రెస్టారెంట్ మేనేజర్ (రాజ చెంబోలు) అదే హోటల్ లో వెయిట్రెస్ గా పనిచేస్తున్న లేఖ(చాందిని చౌదరి) ప్రేమలో పడతాడు. మరో ప్రక్క ఓ మ్యూజిక్ బ్యాండ్ లో సింగర్ అయిన తాన్యా(హెబా పటేల్) కెరీర్ లో ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె మ్యూజిక్ బ్యాండ్ లో తన ఎక్స్ లవర్ కూడా సభ్యుడిగా ఉంటాడు. ఈ మూడు జంటల మధ్య వారి యాంబిషన్స్, డెసిషన్స్ మరియు రిలేషన్స్ కొన్ని పరిణామాలకు దారితీస్తాయి. ఆ పరిణామాలు ఏమిటీ? ఆ రెస్టారెంట్ చుట్టూ ముడిపడివున్న ఈ మూడు జంటల జీవితాలు ఎలా ముగిశాయి అనేది మస్తీస్ కథ..

 

ఏమి బాగుంది?

స్టార్ డైరెక్టర్ క్రిష్ రాసిన ఈ సిరీస్ మంచి పునాది, కథా బలం కలిగి వుంది. కథలో ప్రధాన పాత్రలన్నిటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ డైరెక్టర్ ఆకట్టుకొనే కథనంతో చక్కగా నడిపారు. నేటి ఆధునిక సమాజంలో మనుషుల స్వభావాలు, రిలేషన్స్ మరియు కెరీర్ పట్ల ఉండే ఆలోచన విధానం ఈ సిరీస్ లో చక్కగా ప్రస్తావించారు.

ఇక హీరో నవదీప్ గుడ్ అండ్ బ్యాడ్ యాంగిల్ కలిగిన పాత్రలో మెప్పించారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కించుకున్న హీరోయిన్ బిందు మాధవి మెప్పించింది. ఫిదా ఫేమ్ రాజా చెంబోలు ఎమోషనల్ లవర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ చాందిని చౌదరి లవ్, కెరీర్ పట్ల కన్ఫ్యూషన్ కలిగిన అమ్మాయిగా ఆ పాత్రకు న్యాయం చేశారు. సింగర్ గా హెబ్బాపటేల్ రోల్ సైతం సిరీస్ కి ఆకర్షణగా చెప్పవచ్చు. చివరిగా మోడల్ గా నెగెటివ్ రోల్ చేసిన అక్షర గౌడా ఆకట్టుకున్నారు.

ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సిరీస్ సెటప్, కాస్ట్యూమ్స్ అంతా చాలా రిచ్ గా ఉన్నాయి. మూడు ప్రధాన జంటల మధ్య రిలేషన్స్ మరియు ఎమోషన్స్ బాగా కుదిరాయి. ఇక ఆయా జంటల జీవితాలకు ఇచ్చిన ముగింపు కూడా అలరిస్తుంది.

 

ఏమి బాగోలేదు?

ఇప్పటికే అనేక హిందీ మరియు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు ఈ నేపథ్యంలో వచ్చాయి. దీనితో ఆ సిరీస్ ల ప్రభావం చాలా ఎక్కవుగా ఉన్న భావన కలిగిస్తుంది. ఇక వెబ్ కంటెంట్ కావడంతో బూతుల డోసు కొంచెం ఎక్కువగా వాడేశారు. ఈ సిరీస్ కంటెంట్ సాంప్రదాయ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.

 

చివరి మాటగా

చక్కని ఎమోషన్స్, ఆకట్టుకొనే కథనం, ఉన్నత నిర్మాణ విలువలతో కూడా మస్తీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నేటి నగరాలలో యువతీ, యువకుల మధ్య ఉండే రిలేషన్స్, యాంబిషన్స్, కెరీర్ వంటి విషయాలను చక్కగా ప్రస్తావించారు. కొన్నీ హిందీ వెబ్ సిరీస్ ల వాసనలు ఉన్నప్పటికీ మొత్తంగా అలరిస్తుందని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఈ సిరీస్ మంచి ఛాయిస్.

Rating: 3.25/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు