లాక్ డౌన్ రివ్యూ: రక్తాన్చల్ – హిందీ వెబ్ సిరీస్(ఎమ్ ఎక్స్ ప్లేయర్)

లాక్ డౌన్ రివ్యూ: రక్తాన్చల్ – హిందీ వెబ్ సిరీస్(ఎమ్ ఎక్స్ ప్లేయర్)

Published on Jun 11, 2020 4:35 PM IST

నటీనటులు: క్రాంతి ప్రకాష్ ఝా, నికితిన్ ధీర్, విక్రమ్ కొచ్చర్

దర్శకుడు: రితం శ్రీవాస్తవ్

నిర్మాతలు: జతిన్ సేథి, పియూష్ గుప్తా, శశాంక్ రాయ్, ప్రదీప్ గుప్తా, మహిమా గుప్తా

 

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నేడు హిందీ వెబ్ సిరీస్ రక్తాన్చల్ ని తీసుకోవడం జరిగింది. ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో అందుబాటులో ఉన్న ఈ క్రైమ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షంలో చూద్దాం..

కథాంశం ఏమిటీ?

1980లలో ఉత్తర్ ప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతంలో వసీం ఖాన్(నిఖితన్ ధీర్) గ్యాంగ్ స్టర్ గా ఆ ప్రాంతంపై ఆధిపత్యం చలాయిస్తూ ఉంటాడు. అక్కడి ప్రభుత్వ అధికారులను బెదిరించి అన్ని కాంట్రాక్ట్స్ తన హస్తం గతం చేసుకొని సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో ఆ ప్రాంతానికి విజయ్ సింగ్(క్రాంతి ప్రకాష్ ఝా) వచ్చి వసీం ఖాన్ అధిపత్యానికి గండికొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన పోరులో వీరిద్దరిలో ఎవరు గెలిచారు అనేది మిగతా కథ..

ఏమి బాగుంది?

ప్రధాన పాత్రలో ఒకటైన వసీం ఖాన్ పాత్ర చేసిన నిఖితన్ ధీర్ సాలిడ్ పెరఫార్మెన్సు తో ఆకట్టుకున్నారు. హల్క్ బాడీలో నెగెటివ్ రోల్ కి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా సరిపోయింది. డైలాగ్ డెలివరీ మరియు నటన పరంగా కూడా నిఖితన్ ధీర్ ఆకట్టుకున్నారు.

మరో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిన క్రాంతి ప్రకాష్ ఝా నటన ప్రేక్షకులకు ఆసక్తికలిగించే మరో అంశం.
ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య అధికారం, ఆధిపత్యం కోసం జరిగే పోరును చక్కగా తెరకెక్కించారు. ఇక 80ల లో ఉత్తర భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో లోకల్ డాన్స్ ఆధిపత్యం ప్రజలపై, అధికారులుపై ఎలా ఉండేదో చూపించిన విధానం బాగుంది.

ఏమి బాగోలేదు?

రక్తాన్చల్ వెబ్ సిరీస్ ప్రధాన బలహీనత క్లైమాక్స్. ఇద్దరు బలమైన ప్రత్యర్థుల మధ్య అంత పెద్ద పోరు నడిచాకా ముగింపు పై మరిన్ని అంచనాలు ఏర్పడగా, ఆ అంచనాలను అందుకోలేకపోయారు. ఇక ప్రారంభం ఘనంగా ఉన్నా, మిడిల్ ఎపిసోడ్స్ కొంచెం డల్ గా సాగాయి. మితిమీరిన హింస కూడా ఓ బలహీనతగా చెప్పుకోవచ్చు.

చివరి మాటగా

ప్రధాన పాత్రలు పోషించిన నటుల నటన, బలమైన కథలో ఆకట్టుకొనే పాత్రలు, అద్భుతమైన ఆరంభం కలిగిన రక్తాన్చల్ వెబ్ సిరీస్ చాల వరకు ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇస్తుంది. మిడిల్ ఎపిసోడ్స్ తో పాటు, మంచి క్లైమాక్స్ ఉండి ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉండేది. లాక్ డౌన్ సమయంలో ఓ లుక్ వేయవచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు