లాక్ డౌన్ రివ్యూ : రస్బరి హిందీ వెబ్ సిరీస్(అమెజాన్ ప్రైమ్)

లాక్ డౌన్ రివ్యూ : రస్బరి హిందీ వెబ్ సిరీస్(అమెజాన్ ప్రైమ్)

Published on Jun 27, 2020 3:28 PM IST

నటీనటులు: స్వరా భాస్కర్, సునాక్షి గ్రోవర్, నీలు కోహ్లీ, ఆయుష్మాన్ సక్సేనా, ప్రధుమాన్ సింగ్, చిత్తరంజన్ త్రిపాఠి, అక్షయ్ బాచు, అక్షయ్ సూరి

దర్శకత్వం: నిఖిల్ భట్

నిర్మాతలు: తన్వీర్ బుక్వాలా, సమీర్ నాయర్, దీపక్ సెగల్

సంగీతం: ప్రణయ్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ రస్బరి ని ఎంచుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

మీరట్ కి చెందిన యంగ్ టీనేజర్ నంద్(ఆయుష్మాన్ సక్స్సేనా) కొత్తగా తమ కాలేజ్ కి ఇంగ్లీష్ టీచర్ గా వచ్చిన షాను(స్వర భాస్కర్) పై మనసుపారేసుకుంటాడు. ఆమె ఆలోచనలతో బ్రతికేస్తున్న నంద్ కి షాను మేడం లోని మరో కోణం బయటపడుతుంది. అసలు ఎవరు ఈ షాను? ఆమె నేపథ్యం ఏమిటీ? షాను పై కోరిక పెంచుకున్న నంద్ సంగతి ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే రస్బరి సిరీస్ చూడాలి…

 

ఏమి బాగుంది?

వయసు ప్రభావం వలన టీనేజ్ లో వచ్చే కోరికలతో ఇబ్బందిపడే యువకుడి పాత్రలో ఆయుష్మాన్ సక్సేనా నటన ఆకట్టుకుంది. తన టీచర్ ఆలోచనతో గడిపేసే పాత్రలో అతను మెప్పించాడు. నంద్ పేరెంట్స్ పాత్రలు చేసిన వారు కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారు.

స్మాల్ టౌన్ మీరట్ సెటప్, అక్కడి ఆడవాళ్ళ మనస్తత్వాలు చెప్పిన విధానం బాగుంది. ఇక స్వర భాస్కర్ పాత్రకు నిడివి మరియు ప్రాధాన్యత అంతగా లేకున్నప్పటికీ చాలా వరకు తన గ్లామర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. నంద్ అతని గర్ల్ ఫ్రెండ్ మధ్య రొమాన్స్…బీజీఎమ్ మరియు డైలాగ్స్ ఆకట్టుకొనే అంశాలు.

 

ఏమి బాగోలేదు?

ఇప్పటికే అనేక సినిమాలో చూపించిన టీచర్ అండ్ స్టూడెంట్ రొమాన్స్ డ్రామా ప్రేక్షకులకు కొత్త ఏమీ కాదు. ఐతే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కావడంతో దర్శకుడు కొంచెం రొమాన్స్ డోస్ పెంచి తీశారు. ఇక టీచర్ గురించి స్టూడెంట్స్ చర్చలో వచ్చే పదాలు చాల వల్గర్ ఉన్నాయి. స్వర భాస్కర్ పాత్ర మలచిన విధంగా ఏమి బాగోలేదు. ఆమె పాత్ర ద్వారా దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నాడో అర్థం కాని పరిస్థితి.

ఒక దిశా నిర్దేశం లేకుండా సాగే కథలో అనేక ఎపిసోడ్స్ విసుగుపుట్టిస్తాయి. ఏ దశలో కూడా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేక పోయింది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, డైలాగ్స్ మినహా చెప్పుకోదగ్గ అంశాలు ఏవి లేవు.

 

చివరి మాటగా

మొత్తంగా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన రస్బరి వెబ్ సిరీస్ పాత కాలం కాన్సెప్ట్ తో పాటు అర్థం పర్ధం లేని కథనంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పడుతుంది. స్వర భాస్కర్ గ్లామర్, డైలాగ్స్ మినహాయిస్తే అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సిరీస్ జోలికి వెళ్ళకుంటేనే బెటర్.

Rating: 1.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు