లాక్ డౌన్ రివ్యూ: సాలిస్బరి పాయిజనింగ్స్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్(నెట్ ఫ్లిక్స్)

నటీనటులు: అన్నే-మేరీ డఫ్, రాఫ్ స్పాల్, మైఅన్నా బురింగ్, మార్క్ అడ్డీ, అన్నాబెల్ స్కోలే

రచయితలు: ఆడమ్ ప్యాటర్సన్, డెక్లాన్ లాన్

దర్శకుడు: సాల్ దిబ్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సోలిస్బరి పాయిజనింగ్ ఎంచుకోవడం జరిగింది క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

2018లో రష్యాకు చెందిన మాజీ గూఢచారులు సుర్జాయ్, యూలియా యూ కే లోని సోలిస్భరీ సిటీలో విష ప్రయోగం ద్వారా చంపబడతారు. అది రష్యా మరియు యూకే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇక వారిద్దరినీ చంపడానికి ఉపయోగించిన కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తిస్తారు. అనేక మంది అమాయకుల ప్రాణాలను హరించే ఆ ప్రమాదకర విషం నుండి ఆ సిటీని ఎలా కాపాడగలిగారు అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

ఈ సిరీస్ మొత్తం ఓ సిటీలో అమాయక ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం అధికారులు పడే తపన, మార్గాల అన్వేషణలో తీవ్రతతో సాగే ఉత్కంఠ సన్నివేశాలు అలరిస్తాయి. దేశాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు వంటివి, కొత్త కోణంలో చూపించిన విధానం బాగుంది. అసలు చివరికి ఆ సిటీ ప్రజల ప్రాణాలు ఏమవుతాయో అన్న ఉత్కంఠ సిరీస్ చివరి కొనసాగుతుంది.

అధికారుల మధ్య కొనసాగే టెన్షన్.. కుట్ర కోణం ఆకట్టుకుంటాయి. దేశాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే ఎత్తుగడలు చూపిన విధానం బాగుంది. అలరించే ట్విస్ట్ లు మరియు కట్టిపడేసే కథనం మొత్తంగా నాలుగు ఎపిసోడ్స్ ప్రేక్షకుడిని సిరీస్ తో పాటు ముందుకు తీసుకెళతాయి.

 

చివరి మాటగా

మొత్తంగా సోలిస్బరి పాయిజనింగ్ ఆద్యంతం ఆసక్తిరేపుతూ ప్రేక్షకుడిని కథనంలో లీనం చేస్తూ సాగుతుంది. 45 నిమిషాల నిడివి గల ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగుతాయి. వాస్తవిక సంఘటల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుడి అంచనాలకు మించి గొప్ప అనుభూతినిస్తూ సాగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ లాక్ డౌన్ టైం లో ఈ వెబ్ సిరీస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Rating: 4/5

సంబంధిత సమాచారం :

More