లాక్ డౌన్ రివ్యూ : ‘వాస్ప్ నెట్ వర్క్’ (నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : ‘వాస్ప్ నెట్ వర్క్’ (నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం)

Published on Jun 22, 2020 12:23 PM IST

తారాగణం: పెనెలోప్ క్రజ్, ఎడ్గార్ రామెరెజ్, గేల్ గార్సియా బెర్నాల్, అనా డి అర్మాస్, వాగ్నెర్ మౌరా తదితరులు

దర్శకుడు: ఆలివర్ అస్సాస్

సంగీతం: ఎడ్వర్డో క్రజ్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సినిమా ‘వాస్ప్ నెట్ వర్క్’. ఆలివర్ అస్సాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

 

ఈ ‘వాస్ప్ నెట్ వర్క్’ కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. క్యూబాలో ఉగ్రవాద కార్యకలాపాలను ఆపడానికి యుఎస్ లోని ఒక ప్రధాన సంస్థలోకి చొరబడిన క్యూబన్ గూఢచారుల కథను చెబుతూ ఈ సిరీస్ సాగుతుంది. 1959 లో క్యూబన్ విప్లవం తరువాత, అనేక ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు అమెరికాకు పారిపోయి ఫ్లోరిడాలోని మయామిలో స్థిరపడ్డారు. ఆ తరువాతి కొన్ని దశాబ్దాలలో, వారు క్యూబన్ అమెరికన్ నేషనల్ ఫౌండేషన్ (CANF) అనే సంస్థను ఏర్పాటు చేస్తారు. క్యూబాలో కమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాడటానికి మరియు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయడానికి ఇతర దేశాల మద్దతు సంపాదించడమే వారి అసలు ఆలోచన. ఈ క్రమంలో ‘90 లలో, క్యూబా నుండి చాలా మంది ప్రజలు అమెరికాకు వెళ్లి, క్యూబన్ అమెరికన్ నేషనల్ ఫౌండేషన్ లో పాలుపంచుకుంటారు, అలాగే మాజీ క్యూబన్‌లలో కొంతమందిని డ్రగ్స్‌ ను రవాణా చేస్తూ దాని ద్వారా సంపాదించిన డబ్బుతో క్యూబాలో వినాశనం సృష్టించడానికి ఉపయోగిస్తారు. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి ? చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ.

 

ఏం బాగుంది :

 

మొదట ఈ ఈ ‘వాస్ప్ నెట్ వర్క్’ పై ఆసక్తి ఉండాలంటే.. మొదట ప్రపంచ చరిత్ర మరియు రాజకీయాలపై కొంత అవగాహన అండ్ ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. పైగా ఈ సిరీస్ ‘90 లలో క్యూబాలో ఏమి జరిగిందనే దాని పై ఆసక్తికరమైన అవగాహన ఇస్తుంది. అలాగే యుఎస్ మరియు క్యూబా మధ్య ఉన్న సంబంధాల గురించి మరియు క్యూబన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆర్థిక ఆంక్షల గురించి చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ఈ చిత్రం ‘90 లలో సోవియట్ యూనియన్ పతనం తరువాత క్యూబన్ల జీవితాలను బాగా ఎలివేట్ చేసింది.

ఫిడేల్ కాస్ట్రో పాలనను ‘క్యూబన్ అమెరికన్ నేషనల్ ఫౌండేషన్’ ఎందుకు దించాలని కోరుకుంటుంది మరియు సోవియట్ యూనియన్ పతనం వారికి పెద్ద అవకాశాన్ని ఇచ్చిందనే దాని వెనుక ఉన్న నిరాశను మరియు ఆ అంశం పై మనం అర్థం చేసుకోవడానికి గల చారిత్రక సందర్భాలను ఈ సిరీస్ బాగా చూపించింది. ఈ చిత్రం గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే, ఈ అంశాలన్నింటిపై అంతర్దృష్టితో పాటు ఇంట్రస్టింగ్ ప్లే కూడా ఉంటుంది. పైగా ఏమి చెప్పాలనుకుంటున్నారో దాని గురించి చాలా ఆసక్తిగా చెప్పారు.

ఓల్గా పాత్ర పోషించిన పెనెలోప్ క్రజ్, ఆమె పాత్రలో అద్భుతంగా నటించింది. మరియు ఎడ్గార్ రామిరేజ్ మరియు వాగ్నెర్ మౌరా చెప్పుకోదగిన ప్రదర్శనలు ఇచ్చారు. యోరిక్ లే సాక్స్ మరియు డెనిస్ లెనోయిర్ యొక్క సినిమాటోగ్రఫీ కూడా అద్భుతమైనది.

 

ఏం బాగాలేదు :

 

ఆసక్తికరమైన కథ ఉన్నప్పటికీ, వాస్ప్ నెట్‌వర్క్ పూర్తీ ఆసక్తికరమైన చలనచిత్రంగా సాగలేదు. వాస్తవానికి, గూఢచారులు ఉగ్రవాద కార్యకలాపాలను ఎలా ఆపగలిగారు అనే దాని పై దృష్టి సారించినప్పుడు కూడా కనీసం కథనం కూడా పెద్దగా థ్రిల్లింగ్ ఏమీ లేదు. ప్రతిదీ వాస్తవంగా చెప్పబడింది.

ఇంత పెద్ద కథ మొత్తం.. ఆకట్టుకునే కథగా నిర్మించబడలేదు. పైగా ముఖ్యమైన ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్ కూడా చాలా భయంకరంగా అనిపిస్తుంది. కథ యొక్క ప్లోకి పూర్తిగా ఆటంకం కలిగిస్తుంది. గూఢచారుల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కూడా ప్లే ఎలివేట్ చేయలేకపోయింది. కొన్ని చోట్ల చాల సీన్స్ చాలా నిరుత్సాహపరుస్తాయి.

 

చివరి మాటగా :

 

స్ట్రీమింగ్ లో ఇప్పటికే గూఢచారుల డ్రామాకు సంబంధించి ఎన్నో సిరీస్ లు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, యూఎస్ – క్యూబా నేపథ్యం కారణంగా ఈ ‘వాస్ప్ నెట్‌వర్క్’ సిరీస్ చాల భిన్నంగా అనిపిస్తుంది; అయితే, ఈ చిత్రం గురించి ఇది ఒక్కటే ఆసక్తికరమైన విషయం.. తమ దేశం కోసం అన్నింటినీ వదులుకున్న గూఢచారుల బ్యాచ్ ఎమోషన్ గురించి, గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా లోతైనా ఎమోషనల్ డ్రామాగా ఇది సాగలేదు. ఈ సినిమా చూడకపోవడమే బెటర్. ఇక మీరు ఇలాంటి డ్రామాలను ఇష్టపడేవారైతే, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న ‘ది స్పై’ మంచి ప్రత్యామ్నాయం.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు