“లాక్డ్ చాప్టర్ 2” కి సమాయత్తమవుతున్న టీమ్!

Published on Jul 22, 2021 11:00 am IST

తెలుగు సినీ పరిశ్రమలో కి అడుగు పెట్టిన సరికొత్త ఓటిటి ఆహా వీడియో. ఈ ఓటిటి ద్వారా ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. అయితే లాక్డ్ టెలివిజన్ సిరీస్ ఈ ఆహా వీడియో ద్వారానే గతేడాది విడుదల అయి సక్సెస్ సాధించింది. సత్యదేవ్, సంయుక్త హార్నాడ్, శ్రీ లక్ష్మి, కేశవ్ దీపక్, అభిరామ్ వర్మ, వాసు ఇంటురి, బిందు పగిడమర్రి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అయితే తాజాగా ఇందుకు సంబంధించిన సెకండ్ చాప్టర్ ను సిద్దం చేస్తోంది ఆహా. క్రైమ్ డ్రామా, థ్రిల్లర్ గా తెరకెక్కిన మొదటి చాప్టర్ లో ఏడు ఎపిసొడ్ లతో ఆకట్టుకొగా, ఇప్పుడు రెండవ చాప్టర్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు టీమ్ తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన పోస్టర్ ను నేడు విడుదల చేయగా ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :