కరోనాకు గురైన స్టార్ డైరెక్టర్

Published on Mar 29, 2021 9:00 pm IST

విజయ్ హీరోగా ‘మాస్టర్’ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ విజయంతో లోకేష్ కోలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న డైరెక్టర్ అయ్యారు. దాదాపు అందరు స్టార్ హీరోల జాబితాలోనూ ఆయన పేరుంది. ప్రస్తుతం ఈయన కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది.

ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ కరోనాకు గురయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన లోకేష్ ప్రస్తుతం ఆంతా బాగానే ఉందని, డాక్టర్లు మంచి కేర్ తీసుకుంటున్నారని, త్వరలోనే తిరిగొస్తానని అన్నారు. ‘విక్రమ్’ సినిమా తర్వాత లోకేష్ విజయ్ తో సినిమా చేస్తాడనే టాక్ కూడ ఉంది.

https://twitter.com/Dir_Lokesh/status/1376535352618360832?s=20

సంబంధిత సమాచారం :