వాయిదాపడేలా ఉన్న రజనీ సినిమా !

దక్షిణాది ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్త సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క ‘2 పాయింట్ 0’ కూడా ఒకటి. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం చాన్నాలాల్ పాటు షూటింగ్ జరుపుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ముందుగా సినిమాను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. ఏప్రిల్ 14ను విడుదల తేదీగా కూడా ప్రకటించారు.

కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా ఏప్రిల్ నెలలో రిలీజయ్యేలా లేదు. తమిళ సినీ వర్గాలు కూడా ఇదే మాటను చెబుతున్నాయి. గ్రాఫికల్ వర్క్ ఎక్కువగా ఉండటం మూలాన సినిమా కనీసం 2 నుండి 3 నెలల పాటు వాయిదాపడే అవకాశముందట. అయితే ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్నారు. మరోవైపు పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ చేస్తున్న ‘కాల’ సినిమా కూడ చివరి దశ పనులకు చేరుకుంది.