రవితేజ నుండి ‘ఖాకీ’ లాంటి సినిమాను ఆశించవచ్చా

Published on Nov 14, 2019 8:03 pm IST


మాస్ మహారాజ రవితేజ తన తర్వాతి చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈరోజే చిత్రం లాంఛ్ అయింది. సినిమాకు ‘క్రాక్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. అంటే చిత్రం వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుందని అనుకోవచ్చు.

ఈమధ్య కాలంలో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన పోలీస్ డ్రామా అంటే హెచ్.వినోత్, కార్తిల ‘ఖాకీ’ చిత్రమే. తమిళ చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఆ సినిమా చూసిన మనవాళ్లు ఇలాంటిదే తెలుగు హీరోలు కూడా చేస్తే బాగుంటుందని అనుకున్నారు.

వాళ్లు ఆశించినట్టే ఇప్పుడు రవితేజ ‘క్రాక్’ సినిమా స్టార్ట్ చేశారు. ఇది కూడా ‘ఖాకీ’లానే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. మరి ఆ చిత్రం ఇచ్చిన రియలిస్టిక్ థ్రిల్స్ ఈ చిత్రం కూడా ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More