అఫీషియల్ : ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ వాయిదా..!

అఫీషియల్ : ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ వాయిదా..!

Published on Dec 15, 2025 10:11 AM IST

LIk

‘డ్యూడ్’ సినిమా భారీ విజయం అందుకున్న ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఆయన గత మూడు సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ప్రదీప్ నెక్స్ట్ చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఈ సినిమాను డిసెంబర్ 18, 2025న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా స్టేటస్‌ను అప్‌డేట్ చేస్తూ, సినిమా “త్వరలో” విడుదల అవుతుందని మాత్రమే పేర్కొంది. దీంతో డిసెంబర్ 18 రిలీజ్ ప్లాన్ రద్దైనట్లు స్పష్టమైంది.

ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ ఫాంటసీగా రూపొందుతున్న LIKలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వాలెంటైన్స్ వీక్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు