ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ మీ చిత్రం ఈ శనివారం థియేటర్ల లోకి రానుంది. ఇఫ్ యు డేర్ అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. నిర్మాతలు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు.
లవ్ మీ చిత్రానికి సీక్వెల్ ను కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్. కిల్ మి ఇఫ్ యు లవ్ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సీక్వెల్‌లో ఆశిష్ హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రంపై ఉన్న నమ్మకం తో మేకర్స్ సీక్వెల్ ను అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. హర్షిత్ రెడ్డి, హన్షిత మరియు నాగ మల్లిడి సంయుక్తంగా ఈ లవ్ మీ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.