అంచనాలకు తగ్గట్టుగానే గానే ‘లవ్ స్టోరీ’ బుకింగ్స్.!

Published on Sep 23, 2021 9:00 am IST


ప్రస్తుతం టాలీవుడ్ వీక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ” ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్స్ ఇంకొక్క రోజులో రిలీజ్ కి ఈ చిత్రం రెడీగా ఉంది. శేఖర్ కమ్ముల, చైతు, సాయి పల్లవిలా కాంబోలో స్టార్ట్ అయిన ఈ చిత్రం మొదటి నుంచి కూడా ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఉంది. మధ్యలో పలు అవాంతరాలు వచ్చినా సినిమా పూర్తయ్యి అలా వాయిదా పడుతూ ఉన్నా కూడా థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం ఆడియెన్స్ ఎక్కడా తగ్గలేదు.

అందుకే ఇప్పుడు సరైన సమయం అని మేకర్స్ రిలీజ్ కి రెడీ చేశారు. మరి సరికొత్త రిలీజ్ డేట్ ఇచ్చి బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ప్రతీ చోట కూడా సాలిడ్ బుకింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో అయితే లవ్ స్టోరీ ప్రీమియర్స్ తోనే మంచి ఓపెనింగ్స్ అందుకునేలా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ రెండు లక్షల డాలర్స్ మార్క్ ను కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి లవ్ స్టోరీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి కాంబో నుంచి రేపు ఎలాంటి మ్యాజిక్ జరగనుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :