ఓటిటి సమీక్ష: ‘లవ్ యూ నానమ్మ’ – లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘లవ్ యూ నానమ్మ’ – లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం

Published on Apr 16, 2025 9:01 PM IST

Love you Nanamma Movie Review In Telugu

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 13, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : గీత భాస్కర్, బేబీ శ్రీదేవి, రాజా చెంబోలు, ఆధ్యా పరుచూరి తదితరులు.
దర్శకుడు : శేఖర్ గంగనమోని
నిర్మాణం : కె రాఘవేంద్రరావు బిఏ
సంగీతం : సాకేత్ కొమండూరి
సినిమాటోగ్రఫీ : రాఘవేందర్ వట్టేల
ఎడిటర్ : రాఘవేంద్ర వర్మ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న వీక్లీ లఘు చిత్రాల సిరీస్ నుంచి ఈ వారం వచ్చిన చిత్రమే ‘లవ్ యూ నానమ్మ’. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ప్రస్తుత కాలంలో హైదరాబాద్ లో నివసిస్తున్న పలు బిజీ సాఫ్ట్ వేర్ కుటుంబాల్లో ఓ చిన్నారి చిన్ని (బేబీ శ్రీదేవి) తన తండ్రి (రాజా చెంబోలు) అలాగే తల్లి సుష్మ (ఆద్యా పరుచూరి) అలాగే తన నానమ్మ (గీత భాస్కర్) తో ఉంటుంది. అయితే తన అమ్మా, నాన్నల బిజీ లైఫ్ లో తన ఆలనా పాలన తన నానమ్మే ఎంతో ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. ఇలా నానమ్మ అంటే ఎంతో ప్రేమ పెంచుకున్న చిన్ని నుంచి ఓ రోజు తన నానమ్మ కనిపించకుండా దూరం అవుతుంది? మరి ఆమె ఎందుకు దూరం అయ్యారు? అందుకు కారణాలు ఏంటి? తన కొడుకు కోడలు ఏమన్నా అన్నారా? తాను వెళ్ళిపోయాక చిన్ని పరిస్థితి ఏంటి? చివరికి ఆమె వెనక్కి వచ్చారా లేదా అనేది ఇందులో అసలు కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ప్రధాన బలం ఏదన్నా ఉంది అంటే అది బలమైన భావోద్వేగాలు అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో పెద్దలకి సంబంధించి మర్చిపోతున్న అంశాలని బలమైన ఎమోషన్స్ తో చూపించడం ఎంతగానో కదిలిస్తుంది. ఇంకా తన పాత్రకి గీతా భాస్కర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి అందులో ఇమిడిపోయారు. ఆమెపై ఎమోషనల్ సన్నివేశాలు ఆడియెన్స్ ని తప్పకుండా కదిలిస్తాయి.

నిడివి చిన్నదే అయినప్పటికీ మంచి ఎమోషనల్ షార్ట్ ఫిలింని చూడాలి అనుకునేవారు తప్పకుండ ఈ ఎపిసోడ్ ని చూడవచ్చు. అలాగే బేబీ శ్రీదేవి కూడా తన పాత్రలో చక్కగా చేసింది. తనకి గీతా భాస్కర్ నడుమ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే నటులు రాజా చెంబోలు అలాగే తన భార్య పాత్రలో నటించిన ఆద్యా పరుచూరి తమ పాత్రలకి బాగా సెట్ అయ్యారు.

మైనస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో బలమైన ఎమోషన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుత జెనరేషన్ లో ఇంట్లో అమ్మా నాన్నలు అలాగే పిల్లల విషయంలో అశ్రద్దగా ఉంటున్నారనే పాయింట్ ని ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది.

ఈ లఘు చిత్రం మొదలు నుంచి చివరి వరకు వయసైపోయిన పెద్ద వాళ్ళని తమ పిల్లలు ఎలా చూస్తారన్నారు అనే లానే కనిపిస్తుంది కానీ చిన్ని పాత్రతో సమానంగా గీత భాస్కర్ పాత్ర కూడా ఉంది అనేది క్లైమాక్స్ ఆఖరి మాటల వరకు ఆడియెన్ కి కనెక్ట్ కాకపోవచ్చు.

అలాగే ఒకటీ రెండు సన్నివేశాల్లో ఎమోషన్స్ కొంచెం ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. అలాగేనా చివరికి వచ్చే సరికి కథనం అంతా ఊహాజనితంగానే అనిపిస్తుంది. ఇవి మాత్రం ఈ లఘు చిత్రానికి మైనస్ గా నిలిచాయి.

సాంకేతిక వర్గం:

ఈటీవీ విన్ అలాగే కె రాఘవేంద్ర రావు గారి నుంచి మంచి నిర్మాణ విలువలతో కూడిన ఇలాంటి లఘు చిత్రాలని అందించడం హర్షణీయం అని చెప్పవచ్చు. సంగీతం, పాటలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఓకే.

ఇక దర్శకుడు శేఖర్ గంగనమోని విషయానికి వస్తే.. తాను ఇందులో ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. కానీ మెయిన్ పాయింట్ ని బ్యాలెన్సింగ్ గా చూపించడంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. ఖచ్చితంగా ప్రస్తుత తరానికి తల్లిదండ్రుల పట్ల సొంత పిల్లలే ఎలా ఉంటున్నారు అనే పాయింట్ ని బాగా చూపించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. “లవ్ యూ నానమ్మ” అనే లఘు చిత్రం ఈటీవీ విన్ వారి నుంచి మరో మంచి భావోద్వేగపూరితమైన లఘు చిత్రం అని చెప్పవచ్చు. గీతా భాస్కర్ పై ప్రతీ సన్నివేశం హత్తుకునేలా కనిపిస్తుంది. అలాగే ఇందులో మంచి సోషల్ మెసేజ్ కూడా బాగుంది కానీ మెయిన్ పాయింట్ ని ఇంకా బ్యాలెన్సింగ్ గా చూపించి ఉంటే బాగుండేది. అయినప్పటికీ మంచి ఎమోషనల్ షార్ట్ ఫిలిం ని చూడాలి అనుకునే వారు ఈటీవీ విన్ లో ఈ ఎపిసోడ్ ని చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు