రెండోసారి మణిరత్నంతో పనిచేయనున్న లక్కీ హీరోయిన్ !

దక్షిణాది స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సీనియర్ దర్శకుడు మణిరత్నంగారి సినిమాల్లో ఒక్కసారైనా నటించాలని ఎంతో మంది హీరో హీరోయిన్లు ఆశపడుతుంటారు. అలాంటిది అథితిరావ్ హైదరికి రెండోసారి కూడా ఆయనతో పనిచేసే ఛాన్స్ దొరికింది. ఇది నిజంగా ఆమెకు పెద్ద వార్తనే చెప్పాలి. ప్రస్తుతం మణిరత్నం ఒక భారీ మల్టీ స్టారర్ కు సిద్దమవుతున్నారు.

ఇందులో శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, ఫహద్ ఫాజిల్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి స్టార్లు నటిస్తున్నారు. వీళ్ళతో పాటే అథితిరావ్ హైదరిని కూడా ప్రాజెక్టులోకి తీసుకోనున్నారు మణిరత్నం. రెహమాన్ సంగీతం, సంతోష శివన్ సినిమాటోగ్రఫీ చేయనున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.