35 ఏళ్ళ ఉద్యమ సినిమా.. ‘మా భూమి’!

35 ఏళ్ళ ఉద్యమ సినిమా.. ‘మా భూమి’!

Published on Mar 23, 2015 11:00 AM IST

Maa-Bhoomi
ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు, ఆ సినిమా నిర్దేశించుకున్న తత్వాన్ని, బాధని సరైన రీతిలో చెప్పగలిగినపుడు.. ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుంది, చరిత్రలో గుర్తుండిపోతుంది. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన అలాంటి ఒక సినిమాయే.. ‘మా భూమి’. 1980 మార్చి 23న విడుదలైన ఈ సినిమాకు నేటితో 35ఏళ్ళు పూర్తి కానున్నాయి. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో, బి,నరసింగరావు తదితరులు నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనల్లో ప్రదర్శనకు నోచుకుంది. సినిమాకి 35 ఏళ్ళు పూర్తైన సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న (ఆదివారం) ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో చిత్ర నిర్మాతలతో పాటు, అందులో నటించిన నటీనటులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తాము ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎదుర్కొన్న కష్టాలను, సినిమా విడుదల విషయంలో ఎదురైన సమస్యలను ఈ సందర్భంగా పంచుకున్నారు. చాలా రోజులుగా ప్రేక్షకుడికి అందుబాటులో లేకుండా పోయిన ఈ సినిమాను 25లక్షల రూపాయలకు పైనే వెచ్చించి డిజిటలైజ్ చేశామని పేర్కొన్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన బ్లూరే ప్రింట్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాతలతో పాటు నటులు కాకరాల, భూపాల్ రెడ్డి, సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా, ప్రముఖ రాజకీయ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు