‘మా’ ఎలక్షన్స్: అభ్యర్థుల తుది జాబితా ఖరారు..!

‘మా’ ఎలక్షన్స్: అభ్యర్థుల తుది జాబితా ఖరారు..!

Published on Oct 3, 2021 3:01 AM IST


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబరు 10వ తేదిన జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు. మా అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు.

ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా, జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో నిలిచారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా, రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నారు. ఇక అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు