బాలాజీ మోహన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ , కాజల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మారి. 2015 లో విడుదలై అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘మారి 2’. ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి కథనాయికగా నటిస్తున్నారు. ఆమె ఈచిత్రంలో ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనుంది. ఇటీవల ఈ చిత్రంలోని ఒక సాంగ్ కు ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రభుదేవా నృత్య రీతులు సమకూర్చారు. దాంతో ఈ చిత్రానికి సంభందించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నా ఈచిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ,విద్య , రోబో శంకర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ పతాకం ఫై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈచిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.


