
తెలుగులో నీలకంఠ దర్శకత్వంలో హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ నటినటులుగా ఎమ్.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మాయ’. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను మహేష్ భట్, ముకేష్ భట్ కొనుగోలు చేశారు. ‘మర్డర్ 4’ పేరుతో ‘మాయ’ను అక్కడ రీమేక్ చేస్తున్నారు. హిందీలో కూడా నీలకంఠ దర్శకత్వం వహిస్తారు. మధుర శ్రీధర్ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తారు. హీరో హీరోయిన్లు తదితర వివారాలు త్వరలో వెల్లడవుతాయి.
బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హస్మి హీరోగా నటించిన ‘మర్డర్’, ‘మర్డర్ 2’ సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ‘మర్డర్ 3’లో రణదీప్ హుడా హీరోగా నటించాడు. మహేష్ భట్, ముకేష్ భట్ సోదర ద్వయం నిర్మించిన మర్డర్ సిరీస్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎరోటిక్ థ్రిల్లర్స్ (శృంగారవంతమైన థ్రిల్లర్ చిత్రాలు) గా పేరు గడించాయి. ఈ సిరీస్ లో తెరకెక్కుతున్న నాల్గవ సినిమాకు జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత, మన తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించడం విశేషం.