అదిరిపోయిన నితిన్ “మాచర్ల మాస్ ధమ్కీ”..!

Published on Jul 26, 2022 11:10 am IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో చాలా ఏళ్ల తర్వాత తన నుంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ సినిమాగా వస్తున్న అవైటెడ్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నితిన్ కెరీర్ లో అవైటెడ్ సినిమాగా వస్తుంది. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ మంచి ప్రమోషన్స్ చేస్తుండగా ఈ సినిమా ట్రైలర్ కన్నా ముందే ఒక చిన్న సర్ప్రైజ్ ట్రీట్ ని ఇస్తున్నట్టు తెలిపారు.

అయితే మరి మాచర్ల యాక్షన్ ధమ్కీ అంటూ రిలీజ్ చేసిన ఈ సాలిడ్ వీడియో నెక్స్ట్ లెవెల్ మాస్ గా ఉందని చెప్పాలి. నితిన్ డైలాగ్ తో మంచి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇందులో కనిపిస్తుంది. అలాగే మహతి సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో లెవెల్లో అనిపిస్తుంది. మరి మొత్తానికి అయితే ఈ మాచర్ల మాస్ ధమ్కీ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :