గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న మంచు విష్ణు.

Published on May 27, 2019 12:47 pm IST

మంచు విష్ణు తాజా చిత్రం “ఓటర్”. నిర్మాణాంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ మూవీ ని జూన్ లో ప్రేక్షకుల ముందుకి తేవడానికి చిత్ర బృదం ఏర్పాట్లు చేస్తుంది.

ఐతే ఒక మంచి సినిమాకు మంచి సందర్భం అవసరం, అంతగా విషయం లేని సినిమాలు కూడా మంచి సందర్భంలో విడుదలై అనుకోని విజయాన్ని అందుకున్న సందర్భాలు ఎన్నో. అలాగే చక్కని కథతో పాటు అన్ని విధాలుగా గుడ్ అనుకున్న మూవీలు కూడా రాంగ్ టైములో విడుదలై అపజయం మూటగట్టుకున్న సినిమాలను కూడా చూశాం.
కాబట్టి ఒక సినిమా విడుదలకు , విజయానికి మంచి సందర్భం అవసరం. దీన్నే సినిమా భాషలో సీజన్ అంటారు. గత మూడు నెలలుగా ఎన్నికల హడావుడితో దేశం మొత్తం ఊగిపోయింది. ప్రతి ఒక్కరరూ… ఓటు, పార్టీ, విజయం అనే విషయాలు చర్చించుకున్న వారే కాబట్టి, వీటన్నికి సారూప్యం ఉన్న “ఓటర్”మూవీని మే 23 కి ముందు విడుదల చేయడం చాల వరకు విజయానికి, వసూళ్లకు ఉపకరించేదని ఇండస్ట్రీ పెద్దల వాదన.

ఓటు, దాని ప్రాముఖ్యము తెలిపే సినిమా ఎన్నిక సమయంలో విడుదల కావడం కూడా, ఒకింత సామజిక బాధ్యత నెరవేర్చడంతో పాటు, ట్రెండింగ్ మూవీ కావడంతో ఆడియన్స్ ని చాలావరకు ఆకర్షిస్తుంది. మరి అలాంటి పీక్ సీజన్ ని వదిలేసుకున్న విష్ణు, గోల్డెన్ ఛాన్స్ మిస్సయినట్టే కదా. ఐతే ఈ మూవీ విషయంలో విష్ణు కి, డైరెక్టర్ కార్తీక్ కి మధ్య తలెత్తిన వివాదమే ఆలస్యానికి కారణం అని సమాచారం.

సంబంధిత సమాచారం :

More