ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ సినిమాల్లో నటించిన నటులు కొందరు ఉన్నారు. మరి అలాంటి నటుల్లో ఒకడిగా టాలెంటెడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ చేరడాని చెప్పాలి. విద్యుత్ హిందీ ఆడియెన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. తన కోసం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉంటాయి.
మరి ఈ నటుడు విలన్ గా చేసిన శక్తి, తుపాకీ లేటెస్ట్ గా మదరాసి సినిమాలు ఉన్నాయి. అయితే మదరాసి నిర్మాత ఇటీవల ఈ సినిమా కోసం ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా హోల్డ్ లో పెట్టినట్టు తెలిపారు. ఇప్పుడు ఆ హాలీవుడ్ ప్రాజెక్ట్ ఏంటో రివీల్ అయ్యింది. విద్యుత్ టాలెంట్ కి తన మార్షల్ ఆర్ట్స్ పవర్ కి సరిపడా సినిమా “స్ట్రీట్ ఫైటర్” లైవ్ యాక్షన్ చిత్రం ఇపుడు హాలీవుడ్ నుంచి అనౌన్స్ అయ్యింది.
వీడియో గేమ్ లో స్ట్రీట్ ఫైటర్ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ లో ఒక ఇండియన్ ఫైటర్ గా తను కనిపించనుండడం కన్ఫర్మ్ అయ్యింది. ఇక దీనితో ఇండియన్ ఆడియెన్స్ ఈ సినిమా పట్ల ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఆక్వా మెన్ నటుడు జేసన్ మోమోవా (Jason Momoa) అలాగే డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఫైటర్ రోమన్ రింగ్స్ (Roman Reigns) లాంటి స్టార్స్ కూడా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి కిటావో సకురాయ్ దర్శకత్వం వహిస్తుండగా వచ్చే ఏడాది అక్టోబర్ 16న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.



