సినిమా కోసం రెండేళ్ల తరవాత క్లీన్ షేవ్ చేసిన స్టార్ !

Published on May 12, 2019 10:00 pm IST

పరిశ్రమ ఏదైనా.. ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. క్రీడాకారులు, నటులతో పాటు శాస్త్రవేత్తలు జీవితాలపై కూడా మనవాళ్ళు దృష్టి పెట్టారు. దక్షిణాది స్టార్ నటుడు మాధవన్ కూడా ఇస్రో శాస్త్రవేత్త, గూఢచర్యం కేసులో తప్పుడు ఆరోపణల వలన అరెస్ట్ అయిన నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రి’ అనే సినిమా చేస్తున్నారు. దీన్ని దర్శకుడు అనంత మ‌హ‌దేవ‌న్‌తో కలిసి మాధవన్‌ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు.

ఇందులో మాధవన్ మూడు దశల్లో ఉండే నారాయణన్ పాత్రలో కనిపిస్తారు. అందులో వయసు మళ్ళిన నారాయణన్, మధ్య వయసుల్లోని నారాయణన్ షేడ్స్ కోసం మాధవన్ రెండేళ్లపాటు తెల్లగడ్డం పెంచారు. ఇప్పుడు యుక్త వయసులోని నారాయణన్ పాత్ర కోసం పూర్తిగా షేవ్ చేసి కుర్రాడిలా కనిపిస్తున్నారు మాధవన్. ఈ విషయాన్నే చెబుతూ యంగ్ నంబి నారాయణన్ కోసం రెండేళ్ల తరవాత క్లీన్ షేవ్ చేశాను అంటూ ట్విట్టర్లో ఫోటోలను షేర్ చేశారు ఆయన. ఇకపోతే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More