ఇంటర్వ్యూ : మిక్కీ జె మేయర్ – ‘మహానటి’ నా కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది !

ఇంటర్వ్యూ : మిక్కీ జె మేయర్ – ‘మహానటి’ నా కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది !

Published on Apr 30, 2018 3:56 PM IST

తెలుగు ప్రేక్షకులు ఎంతాగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘మహానటి’ కూడ ఒకటి. మే 9న చిత్ర రిలీజ్ సందర్బంగా చిత్ర సినీగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం..

ఈ సినిమాకి పనిచేయడం పట్ల మీ ఫీలింగ్ ?
ఇలాంటి గొప్ప సినిమాకి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఈ ‘మహానటి’ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. తెరపై సావిత్రిగారి గురించి అందరికీ తెలుసు. కానీ ఆమె జీవితంలో ఏం జరిగిందనేది చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.

ఇందులో మీ వర్క్ ఎలా సాగింది ?
నాకు ఇదొక పెద్ద ఛాలెంజ్ లా అనిపించింది. ఈ సినిమా పాటల కోసం ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడ్డాను.

పాటలు ఎలా వచ్చాయి ?
చాలా బాగా వచ్చాయి. నేనెప్పుడూ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతుంటాను. నా ప్రతి సినిమాలోనూ చేశాను. అలాగే ఈ సినిమాలో కూడ చేశాను. విడుదలైన మొదటి రెండు పాటలకు మంచి స్పందన దక్కింది.

ఈ చిత్రానికి సంగీతం అందివ్వడం కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా ?
అంటే.. సావిత్రిగారి పాత సినిమాలు చూశాను. వాటిలో సంగీత శైలి, ఆమె నటన ఎలా ఉన్నాయో పరిశీలించాను.

అన్నీ అచ్చ తెలుగు పాటలే కదా ఎక్కడా ఇబ్బందిపడలేదా మీరు ?
పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ముందు నేను ట్యూన్ చేసిన తర్వాత సీతారామశాస్త్రిగారు లిరిక్స్ రాసేవారు. అలా ఆయన నాకు హెల్ప్ చేశారు.

నాగ్ అశ్విన్ తో వర్క్ ఎలా ఉంది ?
నాగ్ అశ్విన్ నాకు చాలా కాలం నుండి తెలుసు. పెద్దగా మాట్లాడడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. చాలా మంచివాడు. అతనితో పనిచేయడం మంచి అనుభవం. ఈ సినిమా పట్ల అతని విజన్ నిజంగా గొప్పది.

‘హ్యాపీ డేస్’ తర్వాత మీరు ఆ స్థాయి హిట్ అందుకోలేకపోవడానికి కారణం ?
‘హ్యాపీ డేస్’ లాంటి సినిమాలు కెరీర్లో ఒకసారే వస్తాయి. నా గురించి ఎవరు మాట్లాడినా ముందు ఆ సినిమా గురించే మాట్లాడతారు. ప్రతి సినిమా ‘హ్యాపీ డేస్’ అవలేదు కదా. దేని ప్రత్యకత దానిదే.

మీరు పెద్దగా కమర్షియల్ సినిమాలు చేయరెందుకు ?
నాకు కమర్షియల్ సినిమాలు పెద్దగా నచ్చవు. అందుకే చేయను. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండటం కూడ నచ్చదు. అందుకే కమర్షియల్ సినిమాల వెనుక పరుగెత్తకుండా నాకు వచ్చిన సినిమాలే చేస్తుంటాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు