గుంటూరు అండ్ గాజువాకలో ‘మహర్షి’ వేడుకలు !

Published on Aug 28, 2019 2:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ “మహర్షి ” చిత్రం 100 రోజుల వేడుకలు అభిమానుల ఆద్వర్యంలో గాజువాక సిటీ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానులు ఆద్వర్యంలో గాజువాకలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో ఉత్తరాంధ్ర శ్రీ వెంకేశ్వర ఫిలిమ్స్ దిల్ శ్రీను, శ్రీ కన్య ఏ .సి మేనేజర్ రమణ బాబులకు 100 రోజుల వేడుకల షీల్డ్ ల ను అందజేసి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు చిత్రాలలోని హిట్ సాంగ్స్ ను ప్రదర్శించారు . ఈ వేడుకలలో పాల్గొన్న అభిమానులకు మొమెంటో అందజేశారు .

అలాగే గుంటూరులో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి ” చిత్రం 100 రోజులు శ్రీ లక్ష్మి పిక్చర్ పాలస్ లో ప్రదర్శింప బడిన సందర్బంగా సిటీ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానులు కోట శేషగిరి ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు. సరస్వతి థియేటర్ సెంటర్ లో జరిగిన వేడుకల లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేసారు . హీరో మహేష్ బాబు వైవిధ్య మైన చిత్రాలలో నటిస్తూ కోట్లాది మంది అభిమానులు పొందగలిగారని కోట శేషగిరి అన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు అభిమానులు పాల్గొన్నారు

సంబంధిత సమాచారం :