చెన్నై లో మహర్షి డే 1 కలెక్షన్స్ !

Published on May 10, 2019 8:25 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి నిన్న విడుదలై యబో యావరేజ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నిన్న చెన్నై లో మొదటి రోజు 23లక్షల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో అక్కడ వసూళ్లు రావడం గొప్ప విషయమే. కాగా కోలీవుడ్ లో మహేష్ ,స్పైడర్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు.

ఇక మహర్షి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుందని సమాచారం. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , పివిపి , అశ్వినీ దత్ లు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More