‘మహర్షి’ నాకు చిరస్మరణీయమైన అనుభవం – దిల్ రాజు

Published on May 8, 2019 8:50 pm IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో రేపు అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న ‘మహర్షి’ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా తో మాట్లాడారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మహర్షి ఒక సాధారణ చిత్రం కాదు, అభిమానులు ఎన్ని అంచనాలను పెట్టుకున్నా, ‘మహర్షి’ వాళ్ళ అంచనాలను అవలీలగా అందుకుంటాడు. అలాగే ‘మహర్షి’ రిలీజ్ తరువాత, వంశీ పైడిపల్లి టాప్ డైరెక్టర్ల లిస్ట్ లోకి వెళ్తాడు అని తెలిపారు.

అలాగే తన అఫీస్ పై జరిగిన ఐటీ సోదాల పై స్పందిస్తూ..’భారీ అంచనాలు ఉన్న ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సహజంగానే ఇలాంటి రైడ్స్ జరుగుతాయని.. వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. ‘మహర్షి’ నాకు చిరస్మరణీయమైన అనుభవం అని దిల్ రాజు చెప్పారు.

మహర్షికి 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. యూఎస్ లో కూడా ఈ చిత్రం రికార్డు స్థాయిలో 250 ప్లస్ లొకేషన్స్ లో విడుదలైవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More