యూఎస్ఏ లో భారీ స్థాయిలో విడుదలవుతున్న మహర్షి !

Published on May 8, 2019 5:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి మరి కొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. మహేష్ తో పాటు చిత్ర బృందం సినిమా విజయం ఫై చాలా ధీమా గా వున్నారు. ఇక ఈ చిత్రం యూఎస్ఏ లో అత్యధిక లొకేషన్లలో విడుదలవుతుంది. అక్కడ ఈసినిమా సుమారు 250ఫై గా లోకేషన్లలో విడుదలకానుంది దాంతో ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీమియర్స్ పడనున్నాయి. గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదలచేస్తుంది.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మహేష్ బాబు మొదటి సారి త్రీ షేడ్స్ లో కనిపించనుండగా ఆయనకు జోడిగా పూజా హెగ్డే నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , పివిపి , అశ్వినీ దత్ లు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More