మహర్షి షూటింగ్ అప్డేట్ !

Published on Mar 15, 2019 8:37 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రం యొక్క టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇంకా రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ వున్నాయి. ఏప్రిల్ రెండవ వారంలో ఆ సాంగ్స్ చిత్రీకరణ జరుగనుంది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను ఉగాది రోజు విడుదలచేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈసినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :