ఆకట్టుకుంటున్న ‘మహర్షి’ ట్రైలర్ !

ఆకట్టుకుంటున్న ‘మహర్షి’ ట్రైలర్ !

Published on May 2, 2019 3:00 AM IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఈ రోజు సాయంత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్ లో మహర్షి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ట్రైలర్ లో రిషి పాత్రలో మహేష్ వెరీ స్టైలిష్ గా ఆకట్టుకోగా.. అమాయకుడైన స్టూడెంట్ గా అల్లరి నరేష్ కూడా ఆకట్టుకున్నాడు. అలాగే పూజా పాత్రలో పూజ హెగ్డే కూడా ట్రైలర్ లో చురుగ్గా కనిపించింది. వీరి ముగ్గురి మధ్య స్నేహం కూడా బాగా హైలెట్ అయింది. అలాగే ప్రధానంగా మహేష్ లుక్స్ తోనూ రెండు డిఫరెంట్ షేడ్స్ లోనూ చాలా బాగున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న గ్రాండ్ గా విడుదలకానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు