నైజాంలో ‘మహర్షి’ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ !

Published on May 22, 2019 8:07 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో మహేశ్ బాబు కెరీర్ లోనే భారీ బ్లాక్ బ్లస్టర్ చిత్రంలా నిలిచింది. కాగా రెండో వారం ముగుస్తోన్న నైజాంలో ‘మహర్షి’ ఇంకా మంచి కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది.

మంగళవారం నాడు కూడా ‘మహర్షి’ నైజాంలో 52 లక్షల షేర్ ను రాబట్టింది. నైజాంలో ‘మహర్షి’ ఇప్పటివరకూ మొత్తం 26.37 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే నైజాంలో రంగస్థలం మొత్తం 27.76 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఈ వారం వచ్చే కలెక్షన్స్ తో ‘మహర్షి’, నైజాంలో ‘రంగస్థలం’కు వచ్చిన కలెక్షన్స్ కంటే.. ఎక్కువ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. అప్పుడు నైజాంలో నాన్ బాహుబలి సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా మహర్షి నిలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More