మహేష్ సినిమా నుండి కావాలనే తప్పుకున్నాడట !

Published on Jul 19, 2019 1:00 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుండి సీనియర్ హీరో జగపతి బాబు తప్పుకోవడానికి కారణం.. తన పాత్ర పట్ల సంతృప్తి చెందకపోవడమే అని సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం పై మరో రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు కారణం.. జగపతి బాబునే తన పాత్రలో ప్రకాశ్ రాజ్ అయితే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని.. దర్శకనిర్మాతలను బలవంతగా ఒప్పించి మరి ప్రకాష్ రాజ్ కోసం తన పాత్రను త్యాగం చేశాడట.

ప్రస్తుతం కాశ్మీర్ లో రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కాశ్మీర్ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :