అనిల్ రావిపూడి సినిమాలో విజయశాంతి రోల్ అదేనా ?

Published on May 7, 2019 7:00 pm IST

అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ను పరిశీలిస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోందట. ఈ సినిమాలో మహేశ్ సరసన సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందది.

ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్. ఇప్పుడు ఏకంగా మహేశ్ బాబును డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. మరి మహేశ్ తో కూడా హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More