చెన్నైలో మహేష్, బన్నీ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Published on Jan 16, 2020 1:46 pm IST

తమిళనాట మహేష్ సరిలేరు నీకెవ్వరు బాగానే రాబడుతుంది. విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అక్కడ చెప్పుకోదగ్గ వసూళ్లనే రాబట్టింది. ఇక సరిలేరు నీకెవ్వరు ఐదు రోజులకు గాను, చెన్నై సిటీ పరిధిలో 57లక్షల గ్రాస్ వసూలు చేసింది. టాలీవుడ్ హీరోల సినిమాలకు ఉండే మార్కెట్ రీత్యా ఇవి మంచి వసూళ్లే అని చెప్పాలి. ఇక మరో సంక్రాంతి మూవీ అల వైకుంఠపురంలో కూడా చెన్నై సిటీలో చెప్పుకోదగ్గ వసూళ్లనే సాధించింది. అల వైకుంఠపురంలో నాలుగు రోజులకు 33 లక్షల గ్రాస్ రాబట్టింది. మరో రెండు రోజులలో వీకెండ్ కూడా రానుంది. కాబట్టి వసూళ్లు మెరుగయ్యే అవకాశం కలదు.

కాగా యూఎస్ కలెక్షన్స్ లో అల వైకుంఠపురంలో రికార్డ్ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాల మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది. పండుగ సీజన్లో వచ్చిన చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకులు ఇద్దరి సినిమాలను ఆదరిస్తున్నారు. ఐతే కలెక్షన్స్, ఫిగర్స్ విషయంలో వీరిద్దరి మధ్య ఒకింత అనారోగ్యకరమైన వాతావరణం నెలకొందని కొందరు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More