మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్ హ్యాపీ.!

Published on Feb 11, 2022 8:00 am IST

కొన్ని కొన్ని కీలక సంఘటనలు మన టాలీవుడ్ లో చాలా అరుదుగా జరుగుతాయని చెప్పాలి. మరి అలాంటి అరుదైన సంఘటన నే నిన్న చోటు చేసుకుంది. టాలీవుడ్ లో నెలకొన్న సమస్యకి పరిష్కారం దొరికింది అనే ఆనందంతో పాటుగా మన టాలీవుడ్ కి చెందిన దిగ్గజ హీరోలఒకే ఫ్రేమ్ లో కనిపించడం ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందంగా అనిపించింది.

మెగాస్టార్ చిరు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లు రాజమౌళి, కొరటాల శివ అంత ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఆసక్తిగా మారింది. అయితే ఈ అన్నిటిలో మాత్రం ప్రభాస్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు.

అప్పుడెప్పుడో దశాబ్దంన్నర కితం ఈ ఇద్దరు హీరోలు సాధారణ స్టేజ్ లో ఉన్నపుడు రాని ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలిసి కనిపించినప్పుడు అంతకు మించి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇద్దరు హీరోలు ఏ స్టాండర్డ్స్ లో ఉన్నారో తెలిసిందే. దీనితో ఇప్పుడు ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ ఇలా కనిపించడంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :