మే 31న మహేశ్ కొత్త సినిమా లాంచ్ !

Published on May 26, 2019 12:50 pm IST

అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. కాగా మే 31వ తేదీన అధికారికంగా లాంచ్ కానుంది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తోన్న డైరెక్టర్. డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి .. సక్సెస్ ఫుల్ సినిమాల డైరెక్టర్ గా ఎదిగాడు.

ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్. మరి మహేశ్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు సమాచారం. ఆలాగే రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోందట. కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More