డబ్బింగ్ పనుల్లో ‘భరత్ అనే నేను’ !

‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయికలో వస్తున్న రెండవ చిత్రం ‘భరత్ అనే నేను’. చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదలకానుంది. మహేష్ బాబు కూడ తన పాత్ర తాలూకు డబ్బింగ్ పనుల్ని మొదలుపెట్టేశారు. ఆయనతో పాటు ఇతర నటీనటులు కూడ డబ్బింగ్లో పాల్గొంటున్నారు.

దర్శకుడు కొరటాల శివ దగ్గరుండి ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యంమత్రిగా కనిపించనుండగా బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో వేడుక ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.