అందరూ అనుకున్నట్లే మహేష్ మొదలెట్టేసాడు…!

Published on Jul 29, 2019 12:37 pm IST

గత కొద్దిరోజులుగా మహేష్ ఎదో బిజినెస్ చేయబోతున్నారన్న వార్తలు అన్ని మాధ్యమాల్లో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. మహేష్ తో పాటు, ఆయన టీం ట్విట్టర్ వేదికగా నిర్వహించిన ఒక కార్యక్రమం ఈ అనుమానాలకు తావిచ్చింది. ఐతే అనుకున్న విధంగానే మహేష్ మరో బిజినెస్ రంగంలోకి ప్రవేశించారు. ఇప్పటికే ఏఎంబి బ్రాండ్ నేమ్ తో ముల్టీఫ్లెక్స్ రంగంతో పాటు, చిత్ర నిర్మాణ రంగంలో కూడా మహేష్ అడుగుపెట్టడం జరిగింది.

వీటితో పాటుగా ఆయన ‘ది హంబుల్ కో’ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్నీ ధృవీకరిస్తూ కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్ చేశారు. ఆగస్టు 7న అధికారికంగా ప్రారంభం కానున్న ఈ హంబుల్ కో గార్మెంట్ బ్రాండ్ కి “హంబుల్ కో కేవలం వస్త్రాలు కాదు, జీవన విధానం” అనే ఓ ఆసక్తికరమైన టాగ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే టాలీవుడ్ లోనే అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన స్టార్ హీరోగా అనేక కార్పొరేట్ కంపెనీల వస్తువులకు ప్రచార కర్తగా ఉన్న మహేష్, ఇప్పుడు సొంతగా ఓ బ్రాండ్ ని ప్రారంభించి రియల్ బిసినెస్ మెన్ అనిపించుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :