మహేష్ మనసును గెలుచుకున్న జట్టు ఏదంటే…!

Published on Jul 16, 2019 9:19 am IST

గత ఆదివారం ఇంగ్లాండ్,న్యూజిలాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు జట్లు హోరా హోరీగా పోటీపడిన ఈ మ్యాచ్ డ్రా కాగా,విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహించడం జరిగింది. ఐతే అనూహ్యంగా నిర్ణయాత్మక సూపర్ ఓవర్ లో కూడా రెండు జట్లు సమానంగా 15పరుగులు చేయడంతో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో రెండు బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించడం జరిగింది.

ఐతే ఇలాంటి అరుదైన మ్యాచ్ ని తిలకించిన ప్రిన్స్ మహేష్ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. “గత రాత్రి జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ అనుభవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇంత వరకు ఎప్పుడూ చూడని ఉత్కంఠతను రేపే మ్యాచ్ అది. రెండు జట్లు ఉత్తమమైన ప్రదర్శన చేశాయి. ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిస్తే,న్యూజిలాండ్ మనసులు గెలిచింది. ఇరు జట్లకు అభినందనలు” అని ట్వీట్ చేశారు.ఇటీవల “మహర్షి” మూవీ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరల్డ్ టూర్ వెళ్లిన మహేష్ ఇండియా,ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ కి కుటుంబ సమేతంగా హాజరైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ “సరిలేరు నీకెవ్వరూ” చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా,సీనియర్ నటి విజయశాంతి ఓ కీలకపాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More