“RRR” ట్రైలర్ చూసాక మహేష్ మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.!

“RRR” ట్రైలర్ చూసాక మహేష్ మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.!

Published on Dec 10, 2021 10:02 AM IST

నిన్నటి నుంచి ఇండియన్ సినిమా దగ్గర రాజమౌళి విజువల్ ట్రీట్ “రౌద్రం రణం రుధిరం” ట్రైలర్ హవా నడుస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోస్ తో రియల్ లైఫ్ హీరోస్ పాత్రల ఆధారంగా తీసిన ఈ ఫిక్షనల్ డ్రామా నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యగా దానికి అన్ని వర్గాల్లో యూనానిమస్ రెస్పాన్స్ అందుతుంది.

ఇక ఈ మెగా మాసివ్ ట్రైలర్ చూసాక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఎగ్జైటింగ్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ని చెప్పకుండా ఉండలేకపోయారు. ట్రైలర్ లో ప్రతి ఒక్క షాట్ కూడా స్టన్నింగ్ గా ఉందని, మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్ గా ఈ ట్రైలర్ ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి గూస్ బంప్స్ ఇస్తూ మళ్ళీ వెనక్కి వచ్చాడు అని తన రెస్పాన్స్ ని విషెష్ ని చిత్ర యూనిట్ కి తెలిపారు.

మహేష్ కి ఎంత నచ్చకపోతే ఈ రేంజ్ రెస్పాన్స్ ని తాను అందిస్తాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తో రాజమౌళి ఇంకో భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకా అది ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు