టాలీవుడ్ లో ఆ రికార్డ్ మహేష్ ఒక్కడిదే !

Published on Jan 25, 2020 5:02 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న స్టార్ డమ్ గురించి, సినిమా సినిమాకి పెరుగుతున్న ఆయన మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుని ఫీల్ అయ్యే ఓ విషయం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటివరకూ టాలీవుడ్‌లోని టాప్ 10 ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమాల్లో, మహేష్ బాబు సినిమాలు మూడు ఉన్నాయి.

టాప్ టెన్ మూవీస్ లో ఇలా ఒకే హీరో సినిమాలు మూడు ఉన్న ఏకైక హీరో కూడా మహేషే కావడం విశేషం. 2018లో వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ రెవిన్యూ సాధించిన మహేష్ బాబు, 2019లో ‘మహర్షి’తో అలాగే మొన్న సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు.. టాలీవుడ్ టాప్ టెన్ సినిమాల్లో చోటు సంపాదించాయి.

ఇక సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని అపూర్వంగా ఆదరిస్తూ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిపిన ప్రేక్షకులకు, సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, రావురమేష్ ఫ్యామిలి మెంబ‌ర్స్‌ మధ్య వచ్చే ఒక మంచి హిలేరియ‌స్ సన్నివేశాన్ని ఈ మార్నింగ్ షో నుండి అన్నిసెంటర్స్‌లలో యాడ్ చేసింది చిత్రబృందం.

సంబంధిత సమాచారం :

X
More