హాలీవుడ్ సినిమాతో తెరుచుకోనున్న మహేష్ థియేటర్.!

Published on Dec 1, 2020 11:00 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఏఎంబి సినిమాస్ అనే అదిరిపోయే మల్టీప్లెక్స్ హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. అది తెరిచాక అక్కడికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఆ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ను పంచుకోకుండా ఉండలేకపోయారు. అయితే ఈ ఏడాది లాక్ డౌన్ లో ఈ మాల్ కూడా కొన్నాళ్ళు పాటు మూత పడ్డ సంగతి తెలిసిందే.

కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఫైనల్ గా మహేష్ థియేటర్ కు డోర్లు తెరుచుకోనున్నాయి. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలెన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం “టెనెట్” రిలీజ్ కానుంది. ఈ కొత్త చిత్రం రిలీజ్ మాత్రమే కాకుండా ఈ ఏడాది విడుదల కాబడిన మహేష్ భారీ బ్లాక్ బస్టర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”.

అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురములో” చిత్రాలు కూడా స్క్రీనింగ్ కు రానున్నాయి. సో హైదరాబాదీ జానాన్ని మరోసారి ఏఎంబి సినిమాస్ వారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే చాలా మంది సినీ ప్రముఖులు అలాగే మూవీ లవర్స్ కూడా థియేటర్స్ లో మునుపటి రోజులు రావాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More