కంగ్రాట్స్ వైఎస్ జగన్ : మహేష్ బాబు 

Published on May 24, 2019 2:20 pm IST

నిన్న వెలువడిన ఏపీ అంసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని  సంగతి తెలిసిందే.  త్వరలోనే ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.  దీంతో ఏపీతో సంబంధం ఉన్న అనేక మంది ప్రముఖులు జగన్‌కు అభినందనలు తెలుపుతున్నారు.  వారిలో సినీ సెలబ్రిటీలు ప్రముఖంగా కనిపిస్తున్నారు.

ఇప్పటికే రవితేజ, మంచు మోహన్ బాబు, నిఖిల్, మంచు విష్ణు, రాజశేఖర్, నాగార్జున, సుమంత్ లాంటి నటులంతా జగన్‌కు శుభాకాంక్షలు తెలుపగా తాజాగా విదేశాల్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం జగన్‌ను అభినందించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్ చెబుతూ మీ పాలనలో రాష్ట్రం మంచి విజయాల్ని చూస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More