కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు ‘మా అక్క బంగారం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ నేపధ్యంలో సాగే ఈ సినిమాకు ‘మా అక్క బంగారం’ టైటిల్ సరిగ్గా సరిపోతుందని యూనిట్ భావిస్తుందని సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు. గతంలో ఈ సినిమాకు ‘కన్నయ్య’ టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు రాగా దర్శకుడు వాటిని ఖండించారు. ఈసారి ఏమంటారో..?
శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్. మహేష్ బాబు అక్క పాత్రలో నదియా నటిస్తున్నారు. ‘1 నేనొక్కడినే’ తర్వాత మరోసారి మహేష్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2015 వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


